న్యూ అంబేద్కర్ భవన్లో ఎలక్ట్రిసిటీ మరమ్మత్తులు చేపట్టాలి
– సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డిమాండ్

నిజామాబాద్, జూన్ 22 ( లోకంతీరు న్యూస్ ) : జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఎలక్ట్రిసిటీ మరమ్మత్తులు చేపట్టాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు సభలు సమావేశాలు నిర్వహించడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధీనంలో న్యూ అంబేద్కర్ భవన్ కొనసాగుతుందన్నారు. అయితే ఇటీవల తరచూ ఎలక్ట్రిసిటీ రిపేర్లకు గురవుతుందన్నారు. మరమ్మతులు చేపట్టలేక సభలు సమావేశాలు నిర్వహించుకునే వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. ఏసీలు ఆన్ చేస్తే ట్రిప్ కు గురై విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో మరింత పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా వెంటనే ఎలక్ట్రిసిటీ రిపేర్లు చేయించాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ విద్యుత్ అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు కే.గణేష్ పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా నాయకులు మురళి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.