కళ్యాణ లక్ష్మి డబ్బులను పెంచాలి
– చెక్కుల పంపిణీ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

నిజామాబాదు, జూన్ 30 ( లోకంతీరు న్యూస్ ) : రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకున్నా.. కనీసం కల్యాణ లక్ష్మి నగదునైనా పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలాగో నెరవేర్చడం లేదని అన్నారు. కనీసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధానంగా దళారులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను సంప్రదించాలన్నారు. మొత్తం రూ.1.71 కోట్ల విలువ గల 171 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బిజెపి కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, బెల్లాల్ శశాంక్, తదితరులు పాల్గొన్నారు.