సర్టిఫైడ్ డాక్టర్లచే వైద్యం చేసుకోవాలి
– జిల్లా వైద్య శాఖ అధికారి రాజశ్రీ

నిజామాబాద్ , జులై 01 ( లోకంతీరు న్యూస్ ) : ప్రజలు అసలైన సర్టిఫైడ్ డాక్టర్ల చే వైద్యం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రాజ్య శ్రీ పిలుపునిచ్చారు. ఈ మధ్య కాలంలో ఎటువంటి అనుమతులు లేకున్నా ఆసుపత్రులను కొందరు నిర్వహిస్తున్నట్లు కొన్ని పత్రికల్లో కొన్ని చానల్ లలో వచ్చాయని వాటిని పరిశీలించి ఎటువంటి అనుమతులు లేనట్లయితే తగు చర్యలు తీసుకుంటామన్నారు.ప్రాణాలను కాపాడుతూ, సేవాభావంతో సమాజానికి అండగా నిలిచే ప్రతి వైద్యుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అంకితభావం, కరుణ, కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ…
డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….
భారతదేశంలో జూలై 1న డాక్టర్స్ డేను బిధన్ చంద్ర రాయ్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తారన్నారు. ఈ రోజు వైద్యుల సేవలను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి అంకితం చేయబడిందన్నారు.