నిజామాబాద్‌లో గంజాయి కలకలం.. 24.3 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరు అరెస్ట్..రిమాండ్.

నిజామాబాద్, ఆగస్టు 21 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ నగరంలో గురువారం రాత్రి తెల్లవారుజామున 12.35 గంటల సమయంలో సాయి షిర్డీ రైలులో గంజాయి రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో RPF ఆర్ పీ ఎఫ్ పోలీసులు, నిజామాబాద్ ఎస్ ఎచ్ ఓ సంయుక్తంగా రైలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు తమ సీట్ల కింద రెండు సూట్ కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానంతో సూట్‌కేసులను తనిఖీ చేయగా అందులో 24.3 కిలోల ఎండు గంజాయి లభించింది. పట్టుబడిన వ్యక్తులను విచారించగా, తాము ఒడిశా నుంచి షిర్డీకి గంజాయిని తరలిస్తున్నామని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ రవాణాకు గుర్తుతెలియని వ్యక్తి తమకు రూ.10,000 ఇస్తానని చెప్పి, షిర్డీలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఆటో సిద్ధంగా ఉంటుందని, అందులో గంజాయి పెట్టి వెళ్లాలని సూచించినట్లు వారు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.పోలీసుల వివరాల ప్రకారం పట్టుబడిన వారిలో గణేష్ పోలి, తండ్రి: కుమార్ పోలి, వయస్సు 20 సంవత్సరాలు, కలిమేఘి, జగిలిపడే పోస్టు, కోడల సబ్ డివిజన్, గంజాం జిల్లా, ఒడిశా. రెండో వ్యక్తి దీపక్ సాహు, తండ్రి: లోచన్ సాహు, వయస్సు 21 సంవత్సరాలు, జగిలిపడే పోస్టు, గంజాం జిల్లా, ఒడిశా చెందినా వారు అని వివరాలు తెలిపారు.సీజ్ చేసిన వస్తువులు 24.3 కిలోల ఎండు గంజాయి ,2 మొబైల్ ఫోన్లు పట్టుబడిన ఇద్దరు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.ఈ తనిఖీల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐ మల్లేష్, ఆర్ పి ఎఫ్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, షైలేష్, సలీం, దేవేందర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.