సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకు సన్మానం
– ఆరె క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో

ఎడపల్లి, డిసెంబర్ 23 ( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కందగట్ల రామ్ చందర్, ఉపసర్పంచ్ మచ్చుకూరి గంగాధర్ తోపాటు వార్డు సభ్యులను ఎడపల్లి గ్రామ ఆరే క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆరె క్షత్రియ సంఘం నాయకులు కదం ప్రకాష్ రావు, శేఖర్, కిరణ్, మహిపాల్, శంకర్, వార్డు సభ్యులు తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు.