Take a fresh look at your lifestyle.

అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం…

0

అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 02 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ సోమవారం ఒక ప్రకటనలు తెలిపారు. ఇంగ్లిష్ (01), హిందీ (01) ఫిజిక్స్ (01),

జూలజీ (01), సబ్జెక్ట్ లకు తాత్కాలిక పద్ధతిన పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.ఆయా సబ్జెక్ట్ లలో 55శాతం మార్కులతో పీజీ ఉండాలని ఆయన తెలిపారు.పీ హెచ్ డీ /నెట్ /సెట్ బోధనలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం 3.00లోపు ఎల్లారెడ్డి ప్రభుత్వడిగ్రీ కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.6వ తేదీన ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ ఎల్లారెడ్డి నందు ఉదయం 11 గంటలకు నుండి ఇంటర్య్వూలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.