చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
– అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ఐలమ్మ పోరాటం ఆదర్శం
– ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
– బుస్సాపూర్ శంకర్

నిజామాబాద్ అర్బన్, సెప్టెంబర్ 10 ( లోకంతీరు ) : చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో వర్దన్తి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.బీసీ వర్గాల అభివృద్ధి, సాధికారత కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంజలి, రజక సంఘం అధ్యక్షులు సాయిలు, పసుల లక్ష్మణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.