పోలీసులపై చెయ్యి చేసుకున్న వ్యక్తి అరెస్ట్
ఎడపల్లి, నవంబర్ 07 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో గురువారం రోజున పిసి నరేష్ మరియు పిసి హేమంత్ లు విధి నిర్వహణలో భాగంగా బ్లూ కోర్ట్ డ్యూటీలో ఉండగా రాత్రి 10 గంటల సమయంలో జానకంపేటలోని అలీ సాగర్ చౌరస్తా వద్ద అల్తాఫ్ అనే వ్యక్తి తన హోటల్ను తెరిచి ఉంచడంతో కానిస్టేబుళ్ళు రాత్రి ఆలస్యం అయిపోయింది హోటల్ ను మూసివేయండి అని అనగా దానికి అల్తాఫ్ నేను హోటల్ ను మూసివేయను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కానిస్టేబుల్ లను దుర్భాషలాడుతూ, వారిని చేతులతో నెట్టివేస్తూ, విధులకు ఆటంకం కలిగించినాడని పీసి నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్తాఫ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైనది అనిఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ తెలిపారు.