ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశం
ఎడపల్లి, అక్టోబర్ 27 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్రంలో 28. 29 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ చార్జీలు తక్షణమే అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారని ఎడపల్లి వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) సిద్ధి రామేశ్వర్ పేర్కొన్నారు ఈ మేరకు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి ధాన్యం వర్షానికి తడవకుండా పంట నష్టపోకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎడపల్లి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సిద్ధిరామేశ్వర్ సూచించారు ఈ సందర్భంగా ఏవో సిద్ధిరామేశ్వర్ మాట్లాడుతూ భారీ వర్షాల ముప్పు ఉన్నందున కొనుగోలు కేంద్రాల ఇన్ చార్జీలు తమ సెంటర్ల వద్ద ఉన్న వరి ధాన్యం కుప్పలపై కప్పడానికి టర్పాలిన్ కవర్లను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు ధాన్యం నిల్వలను సురక్షితంగా ఉంచడం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు కొనుగోలు కేంద్రాల ఇన్ చార్జీలు తమ పరిధిలోని వరి ధాన్యం గొప్పలపై కప్పడానికి టర్పాలిన్ కవర్ల అవసరమున్నట్లయితే సమాచారాన్ని వెంటనే ఉన్నత అధికారులకు అందించాలని ఏవో సిద్ధిరామేశ్వర్ సూచించారు ధాన్యం కొనుగోలు సెంటర్ పరిధిలో ఏమైనా తర్పాలిన్ కవర్ల కొరత ఉంటే వెంటనే తమకు తెలపాలని సమాచార ఆధారంగా మార్కెటింగ్ శాఖ అధికారుల నుండి తర్పలిన్ కవర్లను వెంటనే తెప్పించి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటామని ఏవో సిద్ధి రామేశ్వర్ తెలిపారు ఇన్ చార్జీలు అలసత్వం వహించకుండా తక్షణమే ఈ రక్షణ చర్యలు ప్రక్రియను పూర్తిచేయాలని అయనా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.