పార్టీ లను అడ్డంపెట్టుకున్న రెడ్ క్రాస్
-
రెడ్ క్రాస్ లో ఓటు కోసం పార్టీలను అడ్డం పెట్టుకొని
-
ఓ పార్టీలో మనిషి… మరో పార్టీ మనసు…
-
స్వచ్ఛందంగా పోటిలో ఉన్న యువత
-
యువత కు రాజకీయ రంగు పూలుముతున్నా గత కమిటీ

నిజామాబాద్, అక్టోబర్ 01(లోకంతీరు ప్రాంతీయ ప్రతినిధి ) : రెడ్ క్రాస్ ఓటు కోసం రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుంటున్న అభ్యర్థులు పేరుకే మేము కేంద్రీయ రాజకీయ పార్టీ మద్దతు ఉంది అని చెప్తూనే మరొక కేంద్రీయ పార్టీ సహకారంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ గా మారింది. ఓవైపు అలా జరుగుతుంటే మరోవైపు వారు వారి కూర్చి కపాడుకోని మళ్లీ కూర్చి లోకి రావాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. నూతనంగా స్వచ్ఛందంగా పోటీ లో ఉన్న అభ్యర్థులకు రాజకీయరంగు ఉంది అని గత కమిటీ నాయకులు ప్రచారం కొనసాగిస్తున్నారని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కమిటీ మీ పార్టీ నుంచి మాకు సహకారం అందించాలని ప్రత్యేకంగా రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే రెండు కేంద్ర రాజకీయ పార్టీల సహకారంతో ఉంటున్నారు అని, ఓ పార్టీలో మనిషి… మరో పార్టీ మనసు పెట్టుకొని స్వచ్ఛంద సంస్థ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. స్వచ్ఛందంగా రెడ్ క్రాస్ లో సమన్య మానవులకు స్వచ్ఛందంగా సేవ మార్గముతో పని చేయాలనుకోని కొంత మంది యువత, ప్రోఫిషనల్స్, అఫీషియల్స్ అభ్యర్థులు పోటీ చేసిన వారికే గత కమిటీ రాజకీయ రంగును పులుముతుంది అని కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకు అసలు విషయం తెలుసుకుందాం… అరవింద్ కోసం ప్రచారం చేసిన సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి, బిజెపి వాళ్ళు రెడ్ క్రాస్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని, మేము కాంగ్రెస్ వాళ్లమని, మాకు మీ సపోర్ట్ చేయాలని చెప్పిన బుస్స ఆంజనేయులు ప్యానెల్ వాళ్ళ కు ఎంపీ అరవింద్ కోసం ప్రచారం చేసిన సోషల్ మీడియా, ఆయనకు చెందిన స్వంత సోషల్ మీడియా అని చెప్పుకునే సోషల్ మీడియా నుంచి ఆంజనేయులు ప్యానెల్ కు ప్రచారం జరగడం జిల్లాలో కొత్త చర్చకు తెరలేపింది. ఆంజనేయులు వెనకాల ఎంపీ అరవింద్ ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. లోపాయికారి రాజకీయాలపై జోరైన చర్చ జరుగుతుంది. ఈ సోషల్ మీడియా ప్రచారం విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేల దృష్టికి వెళ్లడంతో, బుస్స ఆంజనేయులు ప్యానెల్ వాళ్ళపై ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆంజనేయులు ప్యానెల్ విశ్వసనీయతపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. తమని తప్పుదోవ పట్టించారని ఆగ్రహం తో ఉన్నారని సమాచారం. ఇప్పటికే గత ప్యానెల్ పైన రకరకాల ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటిపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెట్టారని అంటున్నారు. ఆడిట్ లెక్కలపై కలెక్టర్ కి ఆదేశాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయమైన సమాచారము తెలుస్తుంది.