*నలభై వేల రూపాయల ఆపిల్ ఐప్యాడ్ తిరిగి అప్పగింత*
నిజామాబాద్, – బాల్కొండ నియోజకవర్గం జనవరి 21( లోకం తీరు) :-
నందిపేట్ మండలం నూత్పల్లి గ్రామానికి చెందిన కునింటి కీర్తి రెడ్డి ఈరోజు నిజామాబాదులో సికింద్రాబాద్ కు సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం చేసి తన కాలేజీకి సమీప ప్రాంతమైన కొంపల్లి లో హడావిడిగా బస్సు దిగిపోయినారు.కాని తన వద్దనున్న ఆపిల్ కంపెనీకి చెందిన ఐప్యాడ్ సుమారు 40,000 విలువైనది ఒక క్యారీ బ్యాగ్ లో పెట్టి పైన క్యారేజీలో ఉంచినారు. కానీ ఆ క్యారీ బ్యాగ్ బస్సు కదలిక మూలంగా అమాంతంగా ఓపెన్ అయి బస్సు క్యారేజ్ లోనే జరిపాడింది.ఆ విషయాన్ని గమనించక కీర్తి హడావిడిగా బస్సు దిగిపోయింది. బస్సు వెళ్ళిపోయాక తన క్యారీ బ్యాగ్ బరువు తగ్గిందని చూసుకొనగా అందులో తన ఐప్యాడ్ లేకపోవడం షాక్ కు గురైంది. ఈ విషయం తెలుసు కొనే లోగా బస్సు వెళ్ళిపోయింది. పై విషయాన్ని నిజామాబాద్-1 డిపో మేనేజర్ శ్రీ ఆనంద్ గారికి చెప్పగా నిజామాబాద్-2 డిపో తరఫున డ్యూటీలో ఉన్న జూబ్లీ పాయింట్ కంట్రోలర్ రవికిరణ్ ను అప్రమత్తం చేశారు. పై విషయాన్ని డ్రైవర్ సాయిలు కు చెప్పగా బస్సులో తాను కనుగొన్న ఐప్యాడ్ ను భద్రపరిచి జూబ్లీ బస్టాండ్ లో విదులు నిర్వహిస్తున్న కంట్రోలర్ రవి కిరణ్ సమక్షంలో బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా కంట్రోలర్ రవి కిరణ్ మాట్లాడుతూ బస్సు ఎక్కినప్పుడు గాని మరియు దిగినప్పుడు గాని తమ వెంట తెచ్చుకున్న వస్తువులతో పాటు కొనుగోలు చేసిన టికెట్లు సైతం జాగ్రత్తగా సరిచూసుకొని దిగాలని అలాగే ఎల్లప్పుడూ ఆర్టిసి బస్సులు అనే ఆదరించాలని ఈ సందర్భంగా తెలిపారు.
