ఎస్.బి.ఐ లైఫ్ ఇన్సూరెన్స్ పవన్ డల్లాస్ వారి ఆర్థిక సహాయం అందజేత
ఎడపల్లి, అక్టోబర్ 18 ( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామానికి చెందిన కంజెర్ సంతోష్ కుమార్ గుండె పోటుతో గత కొన్ని నెలల క్రితం తన నివసిస్తున్న ఇంట్లోనే మృతిచెందారు. కంజెర్ సంతోష్ కుమార్ సంవత్సరం 2024 జూన్ నెలలో ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో పవన్ డల్లాస్ సహాయంతో ఒక పాలసీ తీసుకోవడం జరిగింది పాలసీ కట్టిన 6 నెలల వ్యవధిలోనే గుండె పోటుతో చనిపోయారు అయితే నామినీ అయిన సంతోష్ అమ్మ గారు శకుంతలకు ఎస్ బి ఐ లైఫ్ వారు 8 లక్షల 90 వేలు ఇచ్చి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ పడమటి నరేష్ , టెరిటరీ మేనేజర్ గుబిలి నవీన్ , ఫైనాన్సియల్ అడ్వైసర్ పవన్ డల్లాస్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఎస్ బి ఐ డి ఎం ఎస్ ఈ రోజుల్లో నిత్యావసరాలతో ఇన్సూరెన్స్ కూడా చాలా అవసరం అని తెలియచేశారు.