ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు…
– SIR బిజీలో అధికారులు!
– ఇదే అవకాశంగా భావిస్తున్న మొరం వ్యాపారులు
– ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి


నిజామాబాద్, జూన్ 26 ( లోకంతీరు న్యూస్ ) : జిల్లాలో పలుచోట్ల మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు ఇతర పనుల్లో బిజీగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మొరం వ్యాపారులు అనుమతులు లేకుండానే లేదా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జేసీబీ యంత్రాలతో మొరం తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నప్పటికీ పర్యవేక్షణ లోపించిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ఆదాయం కోల్పోతుండటమే కాకుండా పర్యావరణానికి కూడా నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.అక్రమ తవ్వకాల వల్ల గ్రామీణ రహదారులు దెబ్బతినడంతో పాటు వ్యవసాయ భూములు కూడా ప్రభావితమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ తవ్వకాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండ ట్రాకర్ వాహనం నడిపే డ్రైవర్ కీ లైసెన్స్ లేకుండా వారి వాహనంలో మొరం లాగటం లాంటి వాటిని అధికారులు గమనించి అలాంటి వారిపై చర్య తీసుకోవాలని స్థానికులు వాపోతున్నారు.