దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. – కార్మిక సంఘాల జేఏసీ పిలుపు.
నిజామాబాద్ , ఫిబ్రవరి 06 ( లోకం తీరు ): ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె – గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా IFTU, AITUC, CITU, IFTU, IFTU సంఘాల బాధ్యులు ఎం.సుధాకర్, వై.ఓమయ్య, నూర్జహాన్, జీ.భూమయ్య, పి.వరదయ్య లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశ ప్రజలకు, ముఖ్యంగా కార్మిక వర్గానికి చేసిన మేలేమీ లేదన్నారు. ఎన్నోఏళ్లు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా కాలరాస్తూ 04 కార్మిక వ్యతిరేక కోడ్ లను తీసుకువచ్చిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించిందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ – మతతత్వ విధానాలను ప్రతిఘటించాలన్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్ షీట్ ప్రకటిద్దామన్నారు. ఈ నేపథ్యంలోనే 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ కు దేశవ్యాప్త కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. అందులో భాగంగా ఈనెల 16న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ ర్యాలీ బహిరంగ సభలను జిల్లాలోని వేలాది కార్మికులు, రైతులు, రైతు కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు నర్సింగరావు, శివకుమార్, రాములు, లింగం, శివరాజ్, సురేష్, సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.