Take a fresh look at your lifestyle.

నిజామాబాద్ జిల్లాలో ఆహార భద్రతా అధికారుల ఆకస్మిక తనిఖీలు…….

0

నిజామాబాద్ జిల్లాలో ఆహార భద్రతా అధికారుల ఆకస్మిక తనిఖీలు

  

నిజామాబాద్, జూలై  04  ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారులు గత 2 రోజులుగా వివిధ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు మరియు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో గుర్తించిన ప్రధాన లోపాలు :
1. అసంతృప్తికర పరిశుభ్రత – వంటశాలలు మరియు పాత్రలు అపరిశుభ్రంగా ఉండడం
2. నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకం
3. కృత్రిమ రంగు వేసిన మాంసం అమ్మకానికి ఉంచడం
4. ఫ్రిజ్‌లో ఆహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం – కలుషితమైన ఆహారాన్ని వెంటనే ధ్వంసం చేయించడం జరిగింది
5. మూతలు లేని పాత్రల్లో ఆహారాన్ని బహిరంగంగా ఉంచడం

అధికారుల హెచ్చరిక : ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఆహార వ్యాపారులు ఆహార పరిశుభ్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం కారణంగా ఆహారం కలుషితమై ప్రజారోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది.

తీసుకున్న చర్యలు : నిబంధనలు ఉల్లంఘించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు FSSAI చట్టం 2006 సెక్షన్ 32 ప్రకారం Improvement Noticeలు జారీ చేయబడతాయి. 14 రోజుల్లో లోపాలను సరిచేయని వారిపై కఠినంగా జరిమానాలు విధించి, లైసెన్స్ రద్దు చర్యలు తీసుకోబడతాయి.

FSSAI లైసెన్స్ లేని మరియు అపరిశుభ్రంగా ఉన్న దుకాణాల నుండి ఆహారాన్ని కొనుగోలు చేయవద్దని ప్రజలకు ఆహార భద్రతా శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.