Take a fresh look at your lifestyle.

బోసి గ్రామ సభ రసాభస………

0

బోసి గ్రామ సభ రసాభస 

–  ఉన్నవారికి రేషన్ కార్డులు…. మరి రాని వారి పరిస్థితి ఏంటి?

–  ఏది వాస్తవం ఏది అవాస్తవం? 

–  అయోమయంలో బోసి గ్రామస్తులు ?

– గ్రామ ప్రజల సంక్షేమ పథకాల  కల నెరవేరేనా ?

– భోసి గ్రామసభ కార్యక్రమంకు హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్  సిందే ఆనంద్ రావు పటేల్

ముధోల్, జనవరి 21 (లోకంతీరు) :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగు సంక్షేమ పథకాలు బోసి గ్రామంలో మంగళవారం జరిగిన గ్రామసభ  కాస్త రసభ సగం మారింది. రేషన్ కార్డులు ఉన్నవారికి రావడంతో లేనివారు వచ్చినటువంటి నాయకులకు నిలదీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ కు  గ్రామస్తులు  ప్రశ్నించారు. రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుండి లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని ఈ ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ కార్డుల ఇస్తామంటున్న తరుణంలో కొందరి పేర్లు మాత్రమే రావటంతో సుమారు 150 కుటుంబాలు కుటుంబాలు నిలదీసినట్లు సమాచారం. ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్రామ ప్రజలు ఈ పథకాలు మాకు వర్తిస్తాయా లేదా అని ప్రశ్నించారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైన.నాలుగు గ్యారెంటీ పథకాలు గురించి వివరిస్తూ.ఆహార భద్రత కార్డు లేని నిరుపేదలకు ఆహార భద్రత కార్డు, ఇంద్రమ్మ ఇండ్లు, రైతు భరోసా.ఆత్మీయ భరోసా ఈ స్కీమ్ లో ఎన్నికైనటువంటి వారు ఎన్నిక కావలసినవారు తమ తమ పేర్లను అధికారుల దగ్గర నమోదు చేసుకుని ఈ పథకాలను వినియోగించుకోవాలని ఆనందరావు పటేల్  కోరడం జరిగింది. అంతకుముందు కొంతమంది యువకులు, దళితులు వివిధ కుల సంఘ నాయకులు మాకు ఆహార భద్రత కార్డు వచ్చిందా లేదా అని  వివిధ నాయకులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో  తనూర్ మండల మాజీ జెడ్పిటిసి ఉత్తమ్ బాలేరావ్,గ్రామం మాజీ సర్పంచ్ శివరాత్రి ఆనంద్, గ్రామపంచాయతీ సెక్రటరీ రవి కుమార్ గ్రామంలో ఉన్నటువంటి తదితర రాజకీయ నాయకులు, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.