Take a fresh look at your lifestyle.

మన ఊరు మన భద్రత మన బాద్యత …….

0

 శ్రీనగర్ మరియు జాకోర గ్రామాలలో 31 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్

– ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానం

– సైబర్ నేరాల నియంత్రణ మరియు డ్రగ్స్ నియంత్రణ లో ప్రజలు అప్రమంతముగా ఉండవలెను

నిజామాబాద్, జులై 08 ( లోకంతీరు న్యూస్ ) :  నేడు వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ మరియు జాకోర గ్రామ పంచాయతీ కార్యాలయంలో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 31 సీసీ కెమెరాలను  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని , ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని , సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని , సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని , నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వారి భద్రత కోసం సి సి కెమెరా లను పెట్టాలని చెప్పారు. ఇది వారి భాద్యత గా తీసుకోవాలి. దుకాణాల యజమానులు తప్పనిసరిగా సి. సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. శ్రీనగర్ గ్రామంలో 15 మరియు జాకోర గ్రామంలో 16 కెమెరాలు పెట్టి సహకరించిన గ్రామ పంచాయతీలను ను పోలీస్ కమీషనర్ గారు అభినందించారు.

ఈ సందర్భంగా శ్రీనగర్ మరియు జాకోర గ్రామాలలో డ్రగ్స్ నివారణ , సైబర్ నేరాల పట్లl అవగాహన , రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం అన్నీ రకాల జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బోధన్ ఎ.సి.పి. శ్రీనివాస్ , రుద్రూర్ సి.ఐ కృష్ణ , వర్ని ఎస్.ఐ  జి. వంశీ కృష్ణ , కోటగిరి ఎస్.ఐ  శ్రీనివాస్ , రుద్రూర్ ఎస్. ఐ మనోజ్ , శ్రీనగర్ సర్పంచ్  పూర్ణిమ కిరణ్ , జాకోర సర్పంచ్  బి. పెద్ద సాయిలు , మాదాల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సుబ్బారావు , సెక్రెటరీ ఠాకూర్ , రిటైర్డ్ సైంటిస్ట్  తోట చేతన్ కుమార్ , ఏఎంసీ చైర్మన్  కె. సురేష్ బాబు , ఉప సర్పంచ్ దస్తగిరి , బాలవికాస్ ట్రస్ట్ సభ్యులు చంద రాములు బాలయ్య , సాదిక్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.