బోధన్ లో ఆరుగురికి జైలు శిక్ష

ఎడపల్లి, నవంబర్ 12 ( లోకంతీరు ) : బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీల సందర్భంగా మరియు మద్యం సేవిస్తూ బయట తిరిగిన కేసుల్లో ఆరుగురికి జైలు శిక్ష విధించారు బోధన్ కొత్త బస్టాండ్ వద్ద వాహనాల చెకింగ్ సమయంలో ఘనాపూర్ గ్రామానికి చెందిన జి రవిరూ1.000 జరిమానా నాలుగు రోజుల జైలు శిక్ష మచ్చినూర్ గ్రామానికి చెందిన బి మోహన్ కురూ 1.000 జరిమానా రెండు రోజులు జైలు శిక్ష రాకాసిపేట్ పరిసర ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న కే వెంకటేష్ కె శంకర్ లకు ఒక్కరోజు జైలు శిక్ష విధించారు అర్ధరాత్రి సమయంలో బోధన్ లో అనుమానస్పదంగా బయట తిరుగుతున్న షేక్ హుజ్ పర్ షేక్ సోహెబ్ లకు ఒక్కరోజు జైలు శిక్ష విధించారు ఈ శిక్షలను సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి విధించినట్లు బోధన్ ఇంచార్జ్ ఎస్ హెచ్ ఓ భాస్కరాచారి తెలిపారు.