స్వగ్రామం జలాల్పూర్ లో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పర్యటన
– సర్పంచ్ కుటుంబంతో పాటు పలు కుటుంబాలకు పరామర్శ

నిజామాబాద్ రూరల్ , ఆగష్టు 22 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ రూరల్ మండలం జలాల్పూర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి సోమవారం పర్యటించారు. ఇటీవల సర్పంచ్ వెంకట్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం అదే గ్రామానికి చెందిన గనిశెట్టి హరీశ్ అనే యువకుడు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనార్దన్, నాయకులు బాగారెడ్డి, ఉమ్మాజి నరేష్, మోహన్, రాంరెడ్డి, స్థానిక నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.