కాశీఫ్ నగర్ కాలనీలో వర్షపు నీరు
– ఇబ్బందుల్లో పలు కుటుంబాలు

రామారెడ్డి , సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : మండల కేంద్రంలోని కాశీప్ నగర్ కాలనీ లో వర్షపు నీరు నివాసగృహాలలోకి వరద నీరు చేరడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్న కాలనీవాసులు, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక, రోడ్లు లేక, నిలిచిపోయిన నీరు, ఈగలు, దోమలు, త్రాగడానికి కూడా సరిగ్గా రాని మిషన్ భగీరథ వాటర్, ఉండడానికి కూడా వసతి లేని నిరుపేద కుటుంబాలు, వారిని ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించాలని, వర్ష ప్రభావం వలన నివాసాలు బురదమయం అవుతున్నాయని, అవసరమైన వారికి పునరావసం కల్పించాలని, కోరుతూ వరద ఉధృతితో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కాలనీవాసులు తెలిపారు.