Take a fresh look at your lifestyle.

మహిళా సాధికారత కేవలం బిజెపితోనే సాధ్యం…..

0

మహిళా సాధికారత కేవలం బిజెపితోనే సాధ్యం 

  • మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి వందన్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిధి…అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
  • బిజెపి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నారి శక్తి వందన్

నిజామాబాద్, ఫిబ్రవరి 04 ( లోకం తీరు ) : మహిళా సాదారికత బీజేపీ తోనే సాధ్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.ఆదివారం ఇందూర్ పాటిదార్ భవన్ లొ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శక్తి వందన్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు స్త్రీ జాతి స్వేచ్ఛ,సమానత్వం వారి హక్కుల కోసం మహిళా సాధికారత కోసం అనాది కాలం నుండి ఎన్నో ఉద్యమాలు, అణచివేతలు చూస్తూ వస్తున్నాం అని మహిళా సాధికారత అంటే ఒక రోజు మహిళా దినోత్సవం అని పెట్టి ఆ రోజు వారిని గౌరవించి తరువాత వంటిల్లుకు పరిమితం చేయడం కాదని నిజమైన మహిళా సాధికారత అంటే స్త్రీ లు తమ హక్కులను, బాధ్యతలను తెలుసుకొని తనకున్న శక్తి ముక్తులను సమగ్రంగా ఆవిష్కరించుకొని అందిన అన్ని అవకాశాలను వినియోగించుకొని తనకు తన కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడటమే నిజమైన మహిళా సాధికారత అని అన్నారు. అందులోనే భాగంగా విద్య, ఉపాధి,వైద్య కళ, సాహిత్య, క్రీడా, రాజకీయ ఇలా అన్ని రంగాలలో పురుషులతో పాటు సమాన అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వలపై ఉంటుందని స్త్రీ లను గౌరవించే ఏకైక దేశం మన భారత దేశం అని ఈ దేశాన్ని కూడా అమ్మతో పోల్చుకొని భారత మాతగా పిలుచుకుంటాం అని అలాంటి స్త్రీ ల ఆత్మగౌరవం కోసం, వాళ్ళస్వేచ్ఛ,హక్కులను కాపాడటం కోసం, మహిళా సాధికారత కోసం బిజెపి పార్టీ పని చేస్తుందని, బిజెపి మోడీ పరిపాలన వచ్చాక దేశంలో అనేక మార్పులు మనం చూస్తున్నాం అన్నారు. బిజెపి పార్టీ మహిళకు పెద్ద పీట వేసిందని రాబోయే 2029 నాటికీ దేశంలో కాదు ప్రపంచంలో భారత దేశ మహిళలు బలమైన నారి శక్తిగా రూపొందుతారని, అందులోనే భాగంగా ఒక గిరిజన మహిళ ద్రౌపతి మూర్మ్ గారిని రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపి పార్టీదని,మహిళల సాధికారత లొ భాగంగా చట్టసభల్లో కూడా వారికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకురావడం జరిగిందని అన్నారు. స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు గడుస్తున్న గతంలో ఎన్నోసార్లు ఈ బిల్ ప్రవేశపెట్టిన ఆమోదం పొందలేదని,కానీ బిజెపి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నారి శక్తి వందన్ అనే పేరుతో ఈ బిల్ ఆమోదం పొందిందని, ఈ ఘనత బిజెపి పార్టీ నరేంద్ర మోడీ గారికె దక్కుతుందని
ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను మహిళల సాధికారత కోసం తీసుకురావడం జరిగిందని అందులోనే భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్, జన్ దన్ అకౌంట్స్, స్వచ్ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం,ముద్ర లోన్స్, సుకన్య సమృద్ధి యోజన, పోషన్ మహా ఇలా అనేక సంక్షేమ పథకాలు మహిళల అభివృద్ధికి వారి సాధికారాతకు పని చేస్తున్న పార్టీ బిజెపి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శక్తి అభియాన్ ఇంచార్జ్ ఆకుల విజయ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, మహిళా మోర్చా పార్లమెంట్ ఇంచార్జ్ స్రవంతి రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ మహిళా శక్తి వందన్ అభియాన్ కో కన్వీనర్ భోగ శ్రావణి,అధ్యక్షురాలు ప్రవళిక, పల్లె గంగారెడ్డి, ప్రభారీ వెంకటరమణి, పెద్దోళ్ళ గంగారెడ్డి, నాగోళ్ళ లక్ష్మీనారాయణ,కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.