దళిత అమ్మాయి ఘటన పై ఎస్సీ,ఎస్టీ కమిషనర్ రాక…
– కమిషనర్ వెంకటయ్య

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 10 ( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు ఎస్సీ ఎస్టీ కమిషనర్ అండ్ చైర్మన్ శనివారం కామారెడ్డికి రావడం జరిగింది. భకి వెంకటయ్య, కామారెడ్డి జిల్లా డి.ఎస్.పి ప్రకాశ్ ,సీఐ రమణ తో కలిసి మాట్లాడారు. దళిత అమ్మాయికి జరిగిన ఘటనపై అమ్మాయికి న్యాయం జరగాలని సదుద్దేశంతో దళిత సంఘా నాయకులు దారుణాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయగలరని, పరార్ లో ఉన్న ఇంకా ఇద్దరినీ బైండోవర్ చేయాలి. లేనిచో అన్ని సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు, మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య, మాదిగ నాయకులు బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర శివరాజ్, రాష్ట్ర బీఎస్పీ పార్టీ ఈసీ మెంబర్ బట్టన్ కి బాలరాజు, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్, అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లయ్య, ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు యాదయ్య, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బట్టి వెంకటరాములు, ఎమ్మార్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి మాదిగ, రాజకీయ పోరాట సమితి యూత్ అధ్యక్షులు కోటి అశోక్, కొత్తూరు గంగయ్య, అరుణ, లతా, లలిత, విద్యార్థుల జిల్లా అధ్యక్షులు విట్టల్, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, ఎమ్మార్పీఎస్ సంఘాలు, దళిత సంఘాలు, పాల్గొన్నారు. దళిత అమ్మాయి శ్యామల ను అవమానపరంగా జరిగిన దారుణాని ఖండిస్తూ బాధితురాలికి న్యాయం జరగాలని, జిల్లాలో ఇలాంటి సంఘటనలు కాకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాము అని అన్నారు.కామారెడ్డి జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు.బాధిత మహిళలకు కలిసి భరోసా ఇస్తూ ధైర్యం చెప్పడం జరిగింది. లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు.