భోగి మంటలో విద్యార్థినికి గాయాలు…రెండు కాళ్లు కాలిపోయిన వైనం ……
– పట్టించుకోని యజమాన్యం….



నిజామాబాద్ , జనవరి 11(లోకంతీరు): నిజమాబాద్ నగరంలోని ఎస్ టి జీవియర్స్ పాఠశాలల్లో శనివారం సెలవు దినం అయినప్పటికీ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా భోగిమంటలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భోగి మంటలు కాల్చుతుండగా పెట్రోల్ బాటల్ ఒకేసారి అక్కడ ఉన్న సిబ్బంది పడివేయడంతో.. ఇదే పాఠశాల లో రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కోమలి పై సిబ్బంది పెట్రోల్ పడివేయడంతో చిన్నారి రెండు కాళ్ళుకు మంటలు అంటుకున్నాయి. విద్యార్థిని లబోదిబో మని ఏడుస్తూ ఉండటంతో ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆస్పత్రకి తరలించి చికిత్సను నిర్వహిస్తున్నారు.యాజమాన్యం ఇప్పటివరకు స్పందించకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి తండ్రి అయిదో టౌన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.