Take a fresh look at your lifestyle.

మన డివిజన్ అభివృద్దే నా లక్ష్యం…..

0

మన డివిజన్ అభివృద్దే నా లక్ష్యం

43 వ బీజేపీ అభ్యర్థి సోమలింగం

 

నిజామాబాద్ , ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : నలబై మూడవ డివిజన్ అభివృదే నా ప్రధాన ద్యేయం అని బీజేపీ అభ్యర్థి సోమలింగం అన్నారు.ఆదివారం ఆయన 43 వ డివిజన్ లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ వీధిలో సి.సి. రోడ్ల నిర్మాణం , పక్కడ్రైనేజీ వ్యవస్థ చేపడతామన్నారు. అంతే కాకుండా అన్ని ప్రధాన కూడళ్ళలో మరియు వీధుల్లో ఎల్ఈడీ , ఐమాక్స్ దీపాల ఏర్పాటు చేస్తామన్నారు.స్వచ్ఛమైన త్రాగు నీటి సరఫరా , బస్తీ దవాఖానాల ఏర్పాటు ఏర్పాటు చేస్తామన్నారు. వార్డులో పిల్లల కొరకు వృద్ధులు కొరకు వ్యాయమశాల ,పార్క్ ల ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి రోజు చెత్త సేకరణ వార్డును స్వచ్చవార్డు గా తీర్చిదిద్దడం నా ప్రధాన ద్యేయం అన్నారు. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తామన్నారు. ఎంపీ,ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ నిధులతో అన్ని కులాల సంఘాలకు కనీస వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లును కోరారు.

Leave A Reply

Your email address will not be published.