కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం..

ముప్కాల్ , ఫిబ్రవరి 18 ( లోకంతీరు ) : ముప్కల్ కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఈ రోజు పి పద్మావతి నిజామాబాద్ లీగల్ ఎయిడ్ సెక్రెటరీ మరియు వేముల దీప్తి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ వారి ఆధ్వర్యంలొ చట్టాల పై అవగాహన కార్యక్రమం చెప్పట్టారు. ఇందులొ భాగంగా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల గురించి వివరించారు. బాలబాలికల వయస్సులో జరుగుతున్న నేరాల పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు ఆత్మ స్తైర్యాన్ని నింపారు. పిల్లలు తమకు ఆన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా పిర్యాదు చేయాలని తమకు మేము ఉన్నామని బరోసా కల్గాచేసారు. పోక్సో చట్టాలు, బాల కార్మిక చట్టాలు ,ఆన్లైన్ మోసాలు, విద్య హక్కులు పైన క్లుప్తంగా విద్యార్తులకు వివరించారు. ఇట్టి కార్యక్రమంలో కేజీబీవీ ముఖ్య అధికారి వినోద, స్కూల్ సిబ్బంది, ముప్కాల్ ఎస్ఐ భాస్కరాచారి పొలీస్ సిబ్బంది, కోర్టు సుపెరిండెంట్ రమేష్, మండల్ లీగల్ సర్వీస్ ఇంఛార్జి వసంత్ పాల్గొన్నారు.