Take a fresh look at your lifestyle.

గుగ్గిలం అశోక్ ఘన సన్మానం….

0

గుగ్గిలం అశోక్ ఘన సన్మానం.

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 30 ( లోకంతీరు ) : మెదక్ లో జరిగిన అథ్లెట్ 10 కిలోమీటర్లు రన్నింగ్ రేస్లో అశోక్ మెడల్ సాధించినందుకు వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గుగ్గలం అశోక్ ను శాలువాతో మోమోంటొతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా విడిసి అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ మండల యువకులు అశోక్ కు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మీరు యువతకు ఆదర్శంగా ఉండాలని తెలిపారు. అశోక్ అంబాసిడర్ మాట్లాడుతూ నన్ను గ్రామ అభివృద్ధి కమిటీ వారు సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉందని వారికి ధన్యవాదాలు తెలియజేశారు.యువతకు నాయంతు సాయసహారాలు అందిస్తానని అన్నారు. మొన్న రోజు జరిగిన అయిదు రాష్ట్రాలకు ఎంపికల్లో అశోక్ అంబాసిడర్ గా ఎంపిక అయినందుకు వేల్పూర్ మండలానికి మంచి పేరు తెస్తున్నందుకు. యువకులు గ్రామస్తులు అశోకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో విడిసి ఉపాధ్యక్షుడు, సభ్యులు తదితరులు, పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.