మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 25 ( లోకంతీరు ) : భీంగల్ మండలం జాగిర్యాల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మానస ఈరోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిలో బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ బాటలో నడవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆయనతోపాటు విగ్నేష్ మాజీ వార్డ్ మెంబర్, శేఖర్ లక్ష్మీ రాజా గౌడ్, రాజేందర్, రాజన్న, మహమ్మద్ మరో 150 మంది ఉన్నారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధిరె స్వామి, జాగిర్యాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ,చిన్నారెడ్డి, పల్లే శేఖర్,గంగాధర్,రాజేశ్వర్ శివ నాయక్,రత్నం కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.