Take a fresh look at your lifestyle.

కొండాపూర్ లో ఎమ్మెల్యే పరామర్శలు…..

0

కొండాపూర్ లో ఎమ్మెల్యే పరామర్శలు

నిజామాబాద్ రూరల్ , ఆగస్టు 01 ( లోకంతీరు న్యూస్ ) :   నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల రాములు గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. ఆయన్ను వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గౌస్ ఉద్దీన్ కు మాతృవియోగం కలిగింది. ఈ మేరకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, బాకారం రవి, ఉమ్మాజి నరేష్, స్థానిక సర్పంచ్ జీవన్ , ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.