అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి
– 5 లక్షల విలువ చేసే రెండు ఎల్.ఓ.సి లెటర్లను ను అందజేసిన ఎమ్మేల్యే డా.ఆర్. భూపతి రెడ్డి


నిజామాబాద్ రూరల్ , ఆగస్టు 01 ( లోకంతీరు న్యూస్ ) : నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన నాయిక మహేష్ అనారోగ్య సమస్యలతో.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో రూ.5లక్షలకు సంబంధించి ఎల్.ఓ.సి లెటర్ ను బాధితులకు ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు.త కుటుంబ సభ్యులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్, గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.