Take a fresh look at your lifestyle.

నిజామాబాద్ లో ఘనంగా ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్…

0

నిజామాబాద్ లో ఘనంగా ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్

  • షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎంపీ,ఎమ్మెల్యే.

  • నిజామాబాదులో సిఎంఆర్ వస్త్రాలయం ప్రారంభోత్సవంలో సందడి చేసిన సినీ తారలు

  • విశిష్ట అతిథులుగా హాజరైన హీరో రామ్ పోతినేని, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.

  • భారీగా తరలి వచ్చిన అభిమానులు.

  • ప్రారంభోత్సవంలో అభిమానులతో హల్చల్

  • అభిమానులు కూడా సినీ తారలతో సెల్ఫీలతో సందడి


నిజామాబాద్, సెప్టెంబర్ 27 ( లోకంతీరు ) : నగరంలోని హైదరాబాద్ రోడ్ లో ఏర్పాటుచేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ శుక్రవారం ప్రారంభమైంది. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. సీఎంఆర్ వస్త్రాలయానికి బ్రాండ్ అంబాసిడర్ “”ఇస్మార్ట్ శంకర్ “” ఫేo హీరో రామ్ పోతినేని, హీరోయిన్ పాయల్ రాజ్ వుత్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. సినీ తారలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. దీంతో సీఎంఆర్ ఆవరణ సందడిగా మారింది. ఈ సందర్భంగా సినీ తారలు మాట్లాడుతూ, సిఎంఆర్ విభినమైన బ్రాండెడ్ దుస్తులను అందుబాటులో ఉంచుతూ యువతి యువకులను ఆకట్టుకుంటున్నదని, సరసమైన ధరలలో వస్త్రాలను అందుబాటులో ఉంచుతూ ప్రజల అభిమానాన్ని చురుగొంటున్నదన్నారు.నిజామాబాద్ జిల్లా ప్రజలు ప్రేమ కలిగిన వారని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తే ఆనందంగా ఉన్నదని చక్కటి క్రమశిక్షణతో ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని హీరోయిన్ పాయల్ రాజ్ వుత్ అన్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు పోట పోటీగా తమ అభిమాన హీరో, హీరోయిన్ తో సెల్ఫీ ఫోటోలు దిగారు. నిజామాబాద్ నగరానికి హీరో, హీరోయిన్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు పోలీసులతోపాటు ప్రైవేట్ గా ప్రత్యేక బౌన్సర్లను ఏర్పాటు చేశారు. అనంతరం హీరో రామ్, హీరోయిన్ పాయల్ అభిమానులకుల కు అభివాదం చేశారు.ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజలకు సీఎంఆర్ యజమాన్యం హీరో రామ్ పోతినేని, చేతుల మీదుగా పలు బహుమతులను అందజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, స్థానిక కార్పొరేటర్ హేమలత శ్రీనివాస్ ,సీఎంఆర్ యజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.