Take a fresh look at your lifestyle.

డైట్, కాస్మటిక్ చార్జీల పెంపుపై హర్షం…..

0

డైట్, కాస్మటిక్ చార్జీల పెంపుపై హర్షం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం

– జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్

నిజామాబాద్, నవంబర్ 01 ( లోకంతీరు ) :   తెలంగాణ ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కేంపుల నాగరాజు, బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కు ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలిపారు. 2017 నుంచి ఇప్పటివరకు విద్యార్థుల కాస్మెటిక్, డైట్ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురయ్యారని, విద్యార్థులకు కాస్మెటిక్, మెస్ ఛార్జీలు పెంచడంతో బీసీ సంఘం నుండి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని వసతిగృహాలు, అన్ని వసతి గృహాలకు డైట్, కాస్మొటిక్ ఛార్జీల పెంపును వెంటనే అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అంతెకాకుండా విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించే విధంగా అన్ని వసతి గృహాల్లో సక్రమంగా అమలు అయ్యే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని విద్యార్థులకు మంచి ఆహారం అందించడంతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.