Take a fresh look at your lifestyle.

హత్య కేసును ఛేదించిన పోలీసులు…..

0

హత్య కేసును ఛేదించిన పోలీసులు

కామారెడ్డి ప్రతినిధి , నవంబర్ 4 ( లోకంతీరు ) : ఈనెల సదాశివ నగర్ మండల కేంద్రంలో అక్టోబర్ 31న లింగంపల్లి గ్రామ శివారులో జరిగిన హత్య కేసు వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో అక్టోబర్ 31న జరిగిన హత్య కేసును చేదించినట్టు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ తెలిపారు.ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ లో హత్య కేసు వివరాలను వెల్లడించిన ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్, గంగాధర్ అనే వ్యక్తి, కృష్ణ అనే వ్యక్తిని హత్య చేసినట్టు ఒప్పుకోవడం జరిగిందన్నారు. కృష్ణవర్ధన్ నుంచి గంగాధర్ అనే వ్యక్తి తీసుకున్న అప్పు ఇవ్వవద్దని దుర్దేశంతో హత్య చేసినట్టు ఒప్పుకున్నారని స్పష్టం చేశారు. చకచక్యంగా వ్యవహరించి కేసును చేదించిన సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ ఎస్సై రంజిత్ ను పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.