Take a fresh look at your lifestyle.

అతలాకుతలమైన పంటలు..!

0

అతలాకుతలమైన పంటలు..!

— నష్టం స్పష్టంగా అంచనా వేయని వ్యవసాయ శాఖ..?

కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 28 ( లోకంతీరు ) : తుఫాను ప్రభావం జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రంల లో భారీ వర్షపాతం వలన చెరువులు కుంటలు నిండి కొన్నిచోట్ల వరద వృద్ధికి పంటలు కొట్టుకుపోయిన సందర్భాలు చాలావరకు ఉన్నాయి. దేశానికి వెన్నుముక రైతన్న అని చెప్పుకునే మనం భారీ వర్షానికి పంటలు అతల కుతలం అయిన సందర్భంగా పంట నష్టం భారీగానే జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా వ్యవసాయ యంత్రాంగం ఇప్పటివరకు అంచనా వ్యాయం, ఎంత మేరకు నష్టం వాటిల్లింది అనే అంచనాలు ఇప్పటివరకు స్పష్టత లేదు..? దెబ్బతిన్న పంటలకు, కోతకు గురైన ఇతరత్రా పంటల కు సంబంధించి రైతులు కన్నీరు మున్నిరవుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ స్పందించి రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. అయితే రైతు కు నష్టం అంచనా వేసి ప్రభుత్వం తరఫున వారికి సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.