Take a fresh look at your lifestyle.

సాటాపూర్  గేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాస్తారోకో…..

0

సాటాపూర్  గేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాస్తారోకో

ఎడపల్లి, సెప్టెంబర్ 02 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం సాటపూర్ గేట్ చౌరస్తా వద్ద మంగళవారం మండల బీఆర్ఎస్ నాయకులు బోధన్ నిజామా బాద్ రహదారికి అడ్డంగా కూర్చుని రాస్త రోకో నిర్వహించారు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై సిబిఐ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు రాష్ట్రానికి తలమానికంగా నిలచిన కాలేశ్వరం ప్రాజెక్ట ను చూసి ఓర్వలేక ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మాజీ సీఎం కేసీఆర్ కట్టడంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై సి ఐ డి విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించడం సిగ్గుచేటుగా ఉందని, దీనినీ తీవ్రంగా ఖండిస్తున్నట్లుఎడపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు ,నాయకులు తెలిపారు.మంగళవారం ఎడపల్లి మండల పరిధిలోని సాటాపూర్ గేట్ వద్ద ఆ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతూ రాస్తారోకో, చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అధికార ప్రభుత్వం నిందలు వేయడం సరికాదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఓ పక్కరైతులకు యూరియా దొరకకపోవడంతోఅనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమనీ ఎడపల్లి తాజా మాజీ ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ అన్నారు.గత ప్రభుత్వ హయంలో పదేళ్ల కాలం పాటు రైతులకు రైతుబంధు, రైతు బీమా ,సరిపడ యూరియా, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. మాజీ సీఎం,కేసిఆర్ పై సి బి సి ఐ డి విచారణ జరిపిస్తే మండలంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆపార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాయకులు ఆకుల శ్రీనివాస్, బట్టు.హన్మాండ్లు, అరుగుల నాగరాజ్, హస్సేన్, సిరిగిరీ మహేష్, ఓం గంగాధర్ గౌడ్, దుబ్బాక రవీందర్ గౌడ్, కొండసాయిలు, పరిగె సుమన్, గంగాధర్, రాజు,దొడ్డి శ్రీనివాస్, ఉండి నాగేంధర్ రెడ్డి, మహబూ బ్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.