అమ్మాయి పెళ్ళికి పుస్తేమట్టేలు అందజేత
కామారెడ్డి జిల్లా, డిసెంబర్ 25 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో పాపగారి ఇందిరా భర్త కీ.శే ఎల్లయ్య గారి కుమార్తె భవాని వివాహానికి కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మినుకురి బ్రహ్మానందరెడ్డి బుధవారం పుస్తేమెట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఆడపిల్ల పెండ్లికి సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. నూతన వధూవరులు కలకాలం పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఇందూరి నరేష్ గౌడ్, శేఖర్ గౌడ్, శివయ్యపల్లి దేవరాజ్, దేవొళ్ళ చరణ్ గౌడ్, శివ్వగారి నర్సింలు, అక్కి బాలరాజు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.