Take a fresh look at your lifestyle.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే…..

0

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే

— ధన్ పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్,  జనవరి 10 ( లోకంతీరు ) : వైష్ణవ సాంప్రదాయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ ఏడుకొండల వారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ దర్శించు కున్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తెలుగు ప్రజలందరు భక్తి, శ్రద్దలతో పవిత్రంగా ఈ వైకుంఠ ఏకా దశి పండుగను జరుపుకుం టారన్నారు. ఈ ఒక్క ఏకాద శి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందున దీనిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారన్నారు.ముక్కోటి దేవతల ఆశీర్వాదం తెలుగు రాష్ట్రాల ప్రజల పై ఉండాలని ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయు రారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యా లతో సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలని ఆ శ్రీవారిని వేడుకున్నట్లు తెలుపుతు తెలుగు రాష్ట్రాల ప్రజలంద రికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.