మద్యం సేవుంచి వాహణం నడుపుతూ పట్టుబడిన వ్యక్తులకు జైలు శిక్ష

నిజామాబాద్ , జనవరి 10 ( లోకంతీరు ) : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 20 మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరుపరచగా 16 మందికి 25,500 రూపాయలు జరిమానా విధించి, నలుగురు వ్యక్తులకు గాను ఎండి సలీం తండ్రి అబ్బాస్ నివాసము కంటేశ్వర్, ఎస్ సంతోష్ తండ్రి బాబు రాథోడ్ నివాసము వర్ని, బి సంతోష్ తండ్రి ఉమాకాంత్ నివాసము వినాయక్ నగర్ అను వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష తో పాటు కమల్ సింగ్ తండ్రి బన్సీ సింగ్ నివాసము గంజి అను వ్యక్తికి ఒకరోజు జైలు శిక్ష విధించడం జరిగింది.