నందమూరి తారక రామారావు వర్ధంతి ఘనంగా వేడుకలు

ముధోల్, జనవరి 18 ( లోకంతీరు ) : భైంసా పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయం లో ఎన్టీఆర్ వర్ధంతి జనసేన, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.అనంతరం అయన చిత్ర పటానికి ఫుల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు ఆయన సేవలను కొనియాడారు. ప్రజానాయకుడు,కథనాయకుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మ శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరు, ప్రాఖ్యతలు గావించిన మహనీయుడు ఆశేష ప్రజాభిమానం అయన సొంతం.అపురూపమై నటన కౌశల్యం,అందుకే ఆయన్ను యుగపురుషునిగా కొలిచారు. తెలుగు జాతి మిమల్ని ఎప్పటికి మరచిపోదు మీకు ఇవే మా ఘన నివాళులు అదే స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,డిప్యూటీ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలందరికి అనేక సంక్షేమ పతకాలు పెన్షన్స్ ప్రతి నెల క్రమం తప్పకుండ ప్రజలకు అందజేస్తు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజా క్షేమం కోసం పాటు పడుతున్నారు.కాని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇప్పటి వరకు పెన్షన్ల ఉసెత్తే పరిస్థితి లేదని అన్నారు.ఈ కార్యక్రమం లో తెలుగుదేశం జిల్లా నాయకులు మోహన్,విట్టల్ తెలి రాజు, బ్రహ్మయ్య, భూమేష్, షేక్ ఆఫ్జల్, రమాకాంత్, సంజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.