రాజకీయాల లో అపర అనుభవం ఉంది మరింత అభివృద్ధి చేస్తా
– సర్పంచ్ అభ్యర్థి కటుకం శంకర్

ఎడపల్లి , నవంబర్ 29 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది శనివారం ఎడపల్లి గ్రామానికి చెందిన కటుకం శంకర్ సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ ను పంచాయతీ కార్యాలయంలో దాఖలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని ప్రజలు ఇచ్చే విశ్వాసం మద్దతుతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథకం లో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు