Take a fresh look at your lifestyle.

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు…..

0

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు 

నిజామాబాద్ అర్బన్, ఫిబ్రవరి 18 ( లోకంతీరు ) :  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన అరుగురిని హత్య చేసిన కేసులలో నిజామాబాద్ జిల్లా జడ్జీ శ్రీమతి సునీత కుంచాల రెండు కేసులలో నిందితులు అయిన మాక్లూర్ గ్రామానికి చెందిన A1) మేడిద ప్రశాంత్ A2) మేడిద ఒడ్డెమ్మ లకు జిల్లా జడ్జి కుంచాల సునీత కఠిన కారాగార జీవిత ఖైదు విధించినారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలానికి చెందిన పూన ప్రసాద్ మరియు అతని భార్య రమణి, అతని ఇద్దరు చెల్లెలు శ్రావని, స్వప్న మరియు అతని కవల పిల్లలు అయిన కూతురు పూన చైత్రిక, బాబు చైత్రిక్ లను ఆస్తికోసం ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం ఆరుగురిని అతని తల్లి మరియు ఇతరులతో కలిసి చంపి, నిందితుడు అద్దెకు తెచ్చుకున్న కారు లో అట్టి శవాలను వివిధ ప్రదేశాలలో పడవేయటం జరిగింది. అందులో బాగంగా కవల పిల్లలు అయిన పూన చైత్రిక, బాబు చైత్రిక్ శావాలను వేరు వేరు ప్లాస్టిక్ సంచిలలో మూటకట్టి మెండోరా మండల పరిధిలో గల దూదిగాం గ్రామా శివారులో గల గోదావరి నది సోన్ బ్రిడ్జి పై నుండి గోదావరి నదిలో పడవేయటం జరిగింది. ఇట్టి నేరాలకు సంబందించి మెండోరా పోలీసు స్టేషన్ నందు (2) హత్య కేసులు నమోదు అయినవి, అట్టి కేసులను ఆర్మూర్ రూరల్ CI గార్లు అయిన శ్రీ బి. గోవర్ధన్ రెడ్డి మరియు శ్రీ కె. శ్రీధర్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ చేసి కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాకలు చేయగా, అట్టి మెండోరా పోలీస్ స్టేషన్ కి సంబందించిన 2 కేసులలో కోర్టులో విచారణ అనంతరం నిందితులు అయిన మాక్లూర్ గ్రామానికి చెందినా A1) మేడిద ప్రశాంత్ A2) మేడిద ఒడ్డెమ్మ (ప్రశాంత్ తల్లి) లకు జీవిత ఖైదు విధించినారు. ఇట్టి కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. రాజేశ్వర్ రెడ్డి కోర్ట్ లో వాదనలు వినిపించినారు.నింధితులపై మిగతా నాలుగు హత్య కేసులలో వివిధ కోర్ట్ లలో విచారణ జరుగుచున్నది. ‎

Leave A Reply

Your email address will not be published.