ఎడపల్లిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు

ఎడపల్లి , డిసెంబర్ 06 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారంరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 70 వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ డల్లా సురేష్ మాట్లాడుతూ 1956 డిసెంబర్ 6న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పరినిర్మాణం చెందడం జరిగిందని…. డిసెంబర్ 6 భారతదేశ చరిత్రలో చాలా బాధాకరమైన రోజుగా భావిస్తూ బాబా సాహెబ్ అంబేద్కర్ భౌతికంగా ఈ దేశం నుండి దూరమైన కూడా ఆయన చనిపోయి 70 సంవత్సరాలు అయినా కూడా ఆయన చేత నిర్మించిన రాజ్యాంగం ద్వారా ప్రతి భారతీయుడు మనస్సులో, అంబేద్కర్ ఆలోచనల ద్వారా అన్ని రంగాల ప్రజలలో జీవిస్తూ ఉన్నాడని.. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఐరాస ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించి నిర్వహించడం అంటే భారతీయులందరికీ గర్వకారణమని అదే సమయంలో నేటి కేంద్ర పాలకులు అంబేద్కర్ నామంని చట్టసభలలో ప్రత్యక్ష పార్టీలు సందర్భం బట్టి అంబేద్కర్ పేరును వాడుతుంటే అవహేళన చేయడం చాలా దురదృష్టకరం ఒకవైపు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఆయా దేశాలలో అంబేద్కర్ విగ్రహ స్థాపనాలు శ్రీకారం చుడుతూ అంబేద్కర్ ఆలోచనలను అమలు చేస్తుంటే ఇక్కడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరు తీయడమే తప్పుగా అన్నట్టు వివరించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఈ దేశ బిజెపి పాలకులు అంబేద్కర్ ఆలోచనలను రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే విధంగా వివరించాలని గుర్తు చేస్తున్నాం..భిన్న సంస్కృతులు విన్న భాషలు భిన్న వర్గాలు గల ఈ దేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ యొక్క సేవలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడు యొక్క బాధ్యత.. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారు అంటే ఒకే ఒక కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ చేత నిర్మించబడిన రాజ్యాంగం అనే విషయాన్ని మర్చిపోవద్దని ఈ సందర్భంగా గుర్తిస్తున్నారు ఇట్టి కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు మచ్కురి గంగాధర్, పిల్లంగోల సాయి , ఏనుగు శ్రీనివాస్ ఏనుగు భూమయ్య దళ్ళ సాయిలు .కర్రెల గంగాధర్, బాన రాజు, కాశి గోళ్ళ గంగాధర్ .కాంగ్రెస్ నాయకులు అల్లడీ శ్రీనివాస్ బొప్పరమబ్బులు తదితరులు పాల్గొన్నారు.