ఐదు నెలల బిల్లును వెంటనే చెల్లించాలి

ఎడపల్లి, ఆగస్టు 01 ( లోకంతీరు ) : మధ్యాహ్న భోజన నిర్వహణ బిల్లులు యూక్టేర్ నుండి మినయించాలని, ఐదు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, 9 నెల కోడిగుడ్ల బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత గ్యాస్ సరఫార చేయాలని, డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎడపల్లి మండల విద్యాశాఖ కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది రవికుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఐదు బకాయి వేతనాలు చెల్లించడం లేదన్నారు 10 నెలల కోడిగుడ్లు వంట బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పది నెలల నుండి కోడిగుడ్లు బిల్లులు రాలేవన్నారు ప్రభుత్వం గుడ్లకు ఇచ్చే బడ్జెట్ కి రెండు గుడ్లు కూడా రావని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మేను తీసుకువచ్చి రెండు రకాలు వంటలు బాలబాలికలకు పెట్టాలని, సాంబారు రాగి జావా ఇతర పౌష్టికాహారాన్ని అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులపై ఒత్తిడి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు కేటాయించిన బడ్జెట్ పాత మేనుకే సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజన కార్మికులకు నెలకు10,000 రూపాయల వేతనాన్ని చెల్లించాలని, బదిలీల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, కార్మికులుగానే కొనసాగించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 8వ తేదీన చలో కమిషనర్ హైదరాబాద్ కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టినట్లు ఆమె తెలిపారు.మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రభుత్వంతో సిఐటియు ఆధ్వర్యంలోపోరాటం తప్పదని ఆమె గుర్తు చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ ఎడపల్లి మండల అధ్యక్షురాలు దేరాడి లక్ష్మి,, సిఐటియు జిల్లా నాయకులు జంగం గంగాధర్, తదితరులు ఉన్నారు