విగ్రహాల ఏర్పాటు కు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి నిబంధనలకు లోబడి నడుచుకోవాలి :
పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్….
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , ఆగస్టు 18 ( లోకంతీరు ) :
ఆగస్టు నెల 27న బుధవారం నాడు వినాయక చవితి పండుగ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ పరిధిలో మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు జరుపుకోవాలనుకునేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి పొందాలని, ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఏర్పాటు కు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్ ద్వారా అందించాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ తెలిపారు. ఈ https://policeportal.tspolice.gov.in/index.htm ఆన్లైన్ లింక్ ను క్లిక్ చేసి అందులో దరఖాస్తు దారుని వివరాలు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు, కమిటీ సభ్యులు పేర్లు వారి ఫోన్ నెంబర్లు, విగ్రహం ప్రతిష్టించే రోజు, నిమజ్జనం చేసే తేదీ సమయం, ప్రదేశం, ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు, అదేవిధంగా మండప నిర్వహకులు, గణపతి కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పట్టణాలలో మరియు గ్రామాలలో నిర్వహించే గణపతి మండప నిర్వహకులు ఈ వెబ్సైట్ నందు వివరాలను పొందుపరచాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వివరాలు కాని సందర్భంలో దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి వినాయక ప్రతిష్టాపనకు ప్రాధాన్యత కేటాయించాలని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా కమీషనరేట్ పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో అప్రమత్తంగా ఉంటుందని వెంటనే డయల్ 100 కు సంప్రదించాలని తెలియజేశారు. మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించే వారు తప్పని సరిగా పోలీస్ శాఖ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని సీపీ గారు తెలిపారు.