– పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , ఆగస్టు 18 ( లోకంతీరు ) :
తెలంగాణలో యూరియా కొరత వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్ ఎంపీలు న్యూ ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి రైతుల గోడును బలంగా వినిపిస్తుంటే బీజేపీ వాళ్లు “ఓటు చోరీ” తోపాటు “యూరియా చోరీ” చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అని బీజేపీ ఘాటుగా ధ్వజమెత్తారు. గత మూడు నెలల నుంచి సీఎం రేవంత్ రెడ్డి , తుమ్మల , కాంగ్రెస్ ఎంపీలు నిరంతరం బీజేపీ పై ఒత్తిడి తెచ్చినా యూరియా సమస్య ఇంకా అలాగే ఉందని స్పష్టం చేశారు.ఓటు చోరీ” కాదండి, ఇప్పుడైతే బీజేపీ వాళ్లు “యూరియా చోరీ” చేస్తున్నారు అని సూటిగా ధ్వజమెత్తారు. ఆర్ఎఫ్సిఎల్ (రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ) గురించి మాట్లాడుతూ – డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ తో మాట్లాడి 10 వేల కోట్ల రుణమాఫీ చేయించి ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభం అయ్యేలా చేశారని గుర్తు చేశారు.కానీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా పేరుతో ఫ్యాక్టరీ పూర్తిగా మిస్ మేనేజ్మెంట్కి గురైందని, 12 లక్షల టన్నుల ప్రొడక్షన్ చేయాల్సిన చోట 9 లక్షల టన్నులే వస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ 30% బంద్ అవ్వడం, చైనా – ఉక్రెయిన్ నుంచి యూరియా రాకపోవడం కేంద్ర వైఫల్యమని ప్రశ్నించారు.రామగుండం ఫ్యాక్టరీకి సంబంధించిన మేనేజ్మెంట్ నోయిడా నుంచి జరపడం తగదని, అదే ప్లాంట్ దగ్గరే ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు సరిపడా యూరియా కేటాయించకపోవడం అన్నదాతలపై పెద్ద ద్రోహం అని మండిపడ్డారు.బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నా రైతుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు కావలసిన యూరియా కేటాయింపులు మళ్లీ ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారని, తెలంగాణ రైతుల్ని కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని ఆరోపించారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వాయిదా తీర్మానం పెట్టినా బీజేపీ ప్రభుత్వం అంగీకరించడం లేదని అయినా మేము పోరాటం ఆపమని ,రైతుల న్యాయం కోసం చివరి వరకు పోరాడతాం” అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైతులకు హామీ ఇచ్చారు.