జె పి ఏ పథకం క్రింద రెండు లక్షల రూపాయల చెక్కు అందజేత
ఎడపల్లి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జానకంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో (జె పి ఏ లోన్), సభ్యులుగా ఉన్న పిట్ల గంగాధర్ అనే రైతు ప్రమాద వశత్తు సుమారు మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పిట్ల గంగాధర్ సహకార సంఘంలో (లోన్ సభ్యులు) సభ్యులుగా ఉన్నారు.సంఘం పక్షాన పాలకవర్గం ఆయనకుసంబంధించిన ప్రీమియం చెల్లించారు.పిట్ల గంగాధర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సంఘo అధ్యక్షులు మిద్దె నరేందర్ తో పాటు పాలకవర్గం ఆకుటుంబానికి ప్రమాద వశత్తు (జెపిఏ)బీమా సౌకర్యం ఉండడంతో బాధిత కుటుంబానికి చెక్కు అందే విధంగా కృషి చేశారు. కాగా జనతా పర్సనల్ ప్రమాదవశాత్తు( జె పి ఏ),పథకం లోన్ కింద రెండు లక్షల రూపాయలు చెక్కు మంజూరు కావడంతో బుధవారం సహకార సంఘo అధ్యక్షులు మిద్దె నరేందర్ తో పాటు ఉపాధ్యక్షులు దాసరి ఓడ్డెన్న ఉపాధ్యక్షులు మృతునీ భార్య పిట్ల గంగామని కీ రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు మిద్దె నరేందర్, ఉపాధ్యక్షులు దాసరి ఒడ్డెన్న, పాలకవర్గం సభ్యులు గద్ద పెద్ద సాయన్న, ఓర్సుసాయిలు, కార్యదర్శి గంగారెడ్డి,సిబ్బంది ప్రవీణ్, నర్సయ్య తదితరులు ఉన్నారు.