Take a fresh look at your lifestyle.

బీడీ కార్మికుల ఆగ్రహానికి గురి కాక తప్పదు…..

0

బీడీ కార్మికుల ఆగ్రహానికి గురి కాక తప్పదు

. బి.మల్లేష్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ ) జిల్లా ఉపాధ్యక్షులు

ఎడపల్లి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : త అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం బీడీలు చేసే కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండాజీవనభృతిని వెంటనే అమలు చేయాలని లేనియెడల బీడీ కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి.మల్లేష్ హెచ్చరించారు. బుధవారం నాడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్ పాడు గ్రామంలో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో బి. మల్లేష్ మాట్లాడుతూ పది సంవత్సరాలు టిఆర్ఎస్ (బి ఆర్ ఎస్) పార్టీ బీడీలు చేసే కార్మికులకు అందరికీ ఇవ్వకుండా కటాఫ్ డేట్ పెట్టి కొందరికి మాత్రమే ఇచ్చి మిగతా వారికి మోసం చేసిందని అందుకే ఆ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఓట్లు వేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా మోసగిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా వెంటనే కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన కార్మికులకు అందరికీ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని లేనియెడల స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని బి మల్లేష్ హెచ్చరించారుఅదేవిధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా ఈపీఎఫ్ కార్మికులందరికీ ఇచ్చేటటువంటి పెన్షన్ 9 వేల రూపాయలకు పెంచి ఇవ్వాలని బి. మల్లేష్ డిమాండ్ చేశారుఈ సమావేశంలో యూనియన్ గ్రామ కమిటీ నాయకులు శ్యామల, ప్రమీల, అనురాధ, సప్న, అనిత, అంకిత, లావణ్య, సుజాత వీరితోపాటు అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.