భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏసీపీకి వినతి

ఎడపల్లి, డిసెంబర్ 26 ( లోకంతీరు ) : భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బోధన్ పట్టణంలోని (ఏ.సి.పి శ్రీనివాస్ )గారికి ఇసుక ట్రాక్టర్లు, ఆటోల అతివేగం వలన మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇసుక ట్రాక్టర్ ,ఆటో డ్రైవర్ల పై చట్టరీత్య చర్యలు తీసుకొనుటకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. బోధన్ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ బోధన్ పట్టణ పరిసర ప్రాంతంలోని కల్దుర్కి, సిద్దాపూర్ , ఖండ్గావ్,హున్సా, మందర్న, గ్రామాల నుండి నెంబర్ ప్లేట్ లేని టాక్టర్లు ఆటోలు అధిక ఇసుకలోడుతో డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ల తో ఉదయం 5 ఐదు గంటల నుండి అక్రమ ఇసుక రవాణా చేయిస్తూ ప్రజల ప్రాణాలు తీయిస్తున్నారు. ఒక వారము రోజుల వ్యవధిలోని సాలురా కల్దుర్కి మార్గాలలో ఇట్టి ఇసుక అక్రమ రవాణా అతివేగం వలన రెండు నిండు ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఘటనలపై డివిజన్ లోని రెవెన్యూ, రవాణా శాఖ అధికారులచే సమన్వయం చేసుకొని సమగ్ర విచారణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ డిమాండ్ చేస్తుంది, లేని యెడల జిల్లా కలెక్టర్ ,సిపి గారి దృష్టికి ఇట్టి విషయాన్ని తీసుకెళ్లి ప్రజలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, పట్టణ ప్రధాన కార్యదర్శులు మీర్జాపురం అరవింద్, రాజులదేవి పవన్ కుమార్, సీనియర్ నాయకులు హన్మండ్లు చారి, కందికట్ల వాసు, పెరక వెంకటేష్, గుంత గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షులు గాదె సందీప్, కార్యదర్శులు గంగుల శ్రీకాంత్,శివరాజ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఏనుగంటి గౌతం గౌడ్, నాయకులు బొడ్డు సురేష్, మళ్లారం దత్తు,కిరణ్, ప్రకాష్ ,శ్రీను, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.