Take a fresh look at your lifestyle.

జైతాపూర్ సొసైటీని సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి…..

0

జైతాపూర్ సొసైటీని సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్

ఎడపల్లి, సెప్టెంబర్ 30 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో గల సొసైటీని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ సందర్శించి యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యతను తనిఖీ చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి గోవిందు మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి యూరియా కొరత లేదని రైతులు అవసరమైన సందర్భంలో మాత్రమే ఎరువులను వినియోగించుకోవాలని సూచించారు అలాగే రైతులు రాబోయే యాసంగి సీజన్ లో నానో యూరియా వాడాలని దీని ద్వారా పంట దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు రైతులు వాతావరణ పరిస్థితులను పరిశీలించి కోతల పనులను సమయానికి చేపట్టడం చాలా ముఖ్యం అని వారు తెలిపారు జిల్లా వ్యవసాయ శాఖ తరపున రైతులకు అవసరమైన మార్గదర్శకాలు సాంకేతిక సలహాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ స్పష్టం చేశారు రైతులు ఎరువులను అధికంగా వాడకూడదని సమతుల్యంగా వినియోగించుకోవాలని ఆధునిక పద్ధతిలో సాగు చేస్తేనే అధిక దిగుబడులు సాధ్యమవుతుందని తెలిపారు వారి వెంట ఎడపల్లి వ్యవసాయ శాఖ అధికారి సిద్ధి రామేశ్వర్ సొసైటీ చైర్మన్ సిబ్బంది తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.