Take a fresh look at your lifestyle.

మైనార్టీ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే …

0

మైనార్టీ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే 

 

ఎల్లారెడ్డి, ఆగస్టు 29 ( లోకంతీరు ) : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల ఎల్లారెడ్డిలో గురువారం స్పోర్ట్స్ డే,తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరపడం జరిగిందని ప్రిన్సిపల్ మహమ్మద్ రఫత్ అన్నారు. విద్యార్థులు స్పోర్ట్స్ డే, తెలుగు వర్ణమాలలోని తొలి అక్షరాల ఆకారంలో కూర్చుని అబ్బురపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మహమ్మద్ రఫీత్ మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాల దశ నుంచె నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. చక్కటి ఆశయంతో కృషి చేసిన వారికి నాయకులాగా ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీ కొండ భాస్కర్, తెలుగు ఉపాధ్యాయులు ఖాజా, అనురాధ, బాలరాజు, సంతోష్, ప్రవీణ్, నవీన్ శ్రీదేవి బాలమణి ఫరహనా, రిజ్వాన తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.