నేడు ఎడపల్లిలో టూ కె రన్
ఎడపల్లి, అక్టోబర్ 30 ( లోకంతీరు ) : స్వతంత్ర సమరయోధుడు, జాతీయ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఎడపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల 31 శుక్రవారం నిర్వహిస్తున్నట్లు బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు తెలిపారు.ఎడపల్లి గ్రామ యువత, విద్యావేత్తలు, విద్యావంతులు, పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది,అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు కోరారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఎడపల్లి మండల పరిధిలో గల తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల నుంచి ఎడపల్లి పోలీస్ స్టేషన్ వరకు టు కే రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.